అదీ... అక్కినేని వినయం

పక్షి రాజావారు 1950లో ‘బీదలపాట్లు’ నిర్మించారు. తమిళంలో ‘ఏళై పడుంపాడు’. రెండూ ఒకేరోజున విడుదలయ్యాయి. ప్రధాన పాత్రను చిత్తూరు నాగయ్యే రెండు చిత్రల్లోనూ ధరించారు. ఇందుకు ఆయనకు లక్షరూపాయల పారితోషికం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో ఒక నటుడికి అంత పారితోషికం రావడం అదే తొలిసారి! అదే కథ, పేరుతో విఠలాచార్య 1972లో మరో సినిమా నిర్మించారు. నాగయ్య ధరించిన పాత్రను అక్కినేని నాగేశ్వరరావు ధరించారు. నాగయ్య, చర్చిలోని ఫాదర్‌ పాత్ర ధరించారు. నాటి చిత్రంలో కొళకళత్తూర్‌ శ్యామ- అనే ఆయన రెండు భాషల్లోనూ పాత్రపోషణ చేశారు. తొలిరోజున నాగయ్య, నాగేశ్వరావులు వున్నప్పుడు - ‘‘మీరు ఎంతో అద్భుతంగా నిర్వహించిన పాత్రను నేను నిర్వహిస్తున్నాను. సాహసిస్తున్నందుకు - మీ ఆశీస్సులు అందజేయండి’’ అని పాద నమస్కారం చేశారు అక్కినేని వినమ్రతతో.



- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.