ముద్దు వద్దన్న నిమ్మి!

అలనాటి బాలీవుడ్‌ తార ‘నిమ్మి’ మొదటిసారిగా రాజ్‌కపూర్‌ తీసిన ‘బర్సాత్‌’లో ప్రేమ్‌నాథ్‌ సరసన నటించింది. ఆమె మంచి డిమాండ్‌లో ఉన్నప్పుడు మహబూబ్‌ఖాన్‌ ‘ఆన్‌’ చిత్రం నిర్మించాడు. ఇది భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి పూర్తి నిడివి టెక్నీకలర్‌ చిత్రం. నిమి ఈ చిత్రం మధ్యలో చనిపోతుంది. పంపిణిదారులు చిత్రం రషెస్‌ చూసి నిమ్మి అర్థాంతరంగా చనిపోతే ప్రేక్షకులు తట్టుకోలేరని పేచీ పెడితే మహబూబ్ఖ్‌ాన్‌ ఒక డ్రీం సీక్వెన్స్‌ని నిమి కోసం జోడించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీని ఇంగ్లీష్‌ అనువాదం ‘శావేజ్‌ ప్రిన్సెస్‌’ని లండన్‌లో ప్రీమియర్‌ షోగా నిర్వహించినప్పుడు నిమ్మి కూడా అందులో పాల్గొంది. ప్రీమియర్‌ అనంతరం ‘ఎర్రోస్‌ ప్లిన్‌’ అనే ఇంగ్లీష్‌ నటుడు నిమ్మి చేతిని ముద్దాడబోగా నిమ్మి ‘‘సారీ! ఇలా ముద్దులు పెట్టే సంస్కారం భారతదేశ విరుద్ధం’’ అంటూ ధైర్యంగా తిరస్కరించింది. మహబూబ్‌ఖాన్‌ నిమ్మి సంస్కారానికి గర్వపడ్డాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.