రష్యా నాటకం.. తెలుగు సినిమా!


రష్యన్‌ రచయిత నికొలాయ్‌ గూగోవ్‌ ‘ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌’ అనే నాటకాన్ని రష్యన్‌ భాషలోకి రాస్తే అది ఆంగ్లంలోకి తర్జుమా అయింది. ఆ పేరుతోనే ఆంగ్లంలో సినిమా వచ్చింది. ఆ నాటకాన్ని ముగ్గురు తెలుగు రచయితలు మూడు పేర్లతో అనువదించారు. ఆకాశరామన్న, ఇన్స్‌పెక్టర్‌ జనరల్, ఎందరో మాహానుభావులు పేర్లతో. మూడు నాటకాలూ ప్రదర్శితమయ్యాయి. ఈ నాటకం ఆధారంగానే ‘గ్రామదేవతలు’ (దర్శకుడు సి.ఎస్‌.రావు) పేరుతో సినిమా వచ్చింది. గూగోవ్‌ రాసిన ‘ది వోవర్‌కోట్‌’ కథ కూడా గొప్ప పేరు తెచ్చుకుంది. అదీ రష్యన్‌ భాషలో సినిమాగా వచ్చింది. హిందీలో ‘గరమ్‌కోట్‌’ పేరుతో 1955లో వచ్చింది. బలరాజ్‌సహానీ, నిరూపరాయ్‌ ముఖ్యపాత్రలు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.