అదే ఈ రెండు చిత్రాల రికార్డు!

ఒకటి పది పాత్రలతో లోకనాయకుడు కమల్‌హాసన్‌ నటించిన ‘దశావతారం’. మరొకటి జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడుగా వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’. ఈ రెండింటికి ఓ విషయంలో సంబంధం ఉంది. ఈ రెండు చిత్రాల కథ వేరు, నేపథ్యం వేరు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అవును నిజమే, కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రెండు చిత్రాల్లోనూ మనకు సీతాకోకచిలుకలు కనిపిస్తాయి. ఎందుకంటే ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌’ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాలు తెరకెక్కించారు. కేవలం బటర్‌ఫ్లైస్‌ వల్ల జరిగితేనే అది ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌’ కాదు. ఎక్కడో జరిగిన చిన్న సంఘటన మరెక్కడో పెద్ద సంఘటన జరిగేందుకు దారితీయగలదు. ఈ నేపథ్యంలోనే వచ్చిన చిత్రాలివి. ‘దశావతారం’లో ఈ ప్రస్తావన ఎక్కువగా లేకపోయినా అంతర్లీనంగా దర్శనమిస్తుంది. ‘నాన్నకు ప్రేమతో’లో కథానాయకుడు ఎన్టీఆర్‌ కథానాయికకు వివరిస్తాడు. ఇలా విభిన్న కథాంశంతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రాల రికార్డు ఏంటంటే? ‘బటర్‌ఫై ఎఫెక్ట్‌’ కాన్సెప్ట్‌ తెరకెక్కిన తొలి భారతీయ సినిమా ‘దశావతారం’, రెండో చిత్రం ‘నాన్నకు ప్రేమతో’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.