అలా.. ‘బొబ్బిలిరాజా’తో పరిచయమైంది

వెండి తెరకు ఎవరు ఎప్పుడు, ఎలా పరిచయమవుతారో తెలియదు. ఊహించకుండా వచ్చి హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో దివ్య భారతి ఒకరు. ఆమె అందం, అభినయం తెలుగు సినీ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. వెంకటేశ్‌ కథానాయకుడుగా వచ్చిన ‘బొబ్బిలిరాజా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది భారతి. బి.గోపాల్‌ దర్శకత్వం ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. ముందుగా ఈ సినిమాలో నాయికగా రాధను సూచించారు రామానాయుడు. రాధ అప్పటికే స్టార్‌ నాయిక అవడం, ఇదే తరహా పాత్రలు గతంలో పోషించడం వల్ల ఆమె స్థానంలో నూతన నాయిక అయితే బావుంటుందని అభిప్రాయపడ్డారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. తన దగ్గర ఉన్న ఫొటోలు చూపించి ఈ కథలో పాత్రకు ఎవరు సరిపోతారో మీరే ఎంపిక చేసుకోమన్నారట. అప్పుడు గోపాలకృష్ణ దివ్య భారతి ఫొటో చూసి ‘ఈ అమ్మాయి బావుంది, కథానాయికగా చక్కగా ఉంటుంద’ని చెప్పారు. వెంటనే ఈ ప్రాజెక్టుకు ఆమెను ఎంపిక చేశారు. అలా ‘బొబ్బిలి రాజా’తో ఆడిపాడింది దివ్య భారతి. మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.