దూరదర్శన్‌ వ్యాఖ్యాతగా షారుఖ్‌

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌ నటుడిగా అభిమానులను అలరించడమే కాదు... అప్పుడప్పుడూ వ్యాఖ్యాతగా మారి ఎన్నో వేడుకలను రక్తికట్టించడమూ తెలిసిందే. అవార్డు వేడుకలకు హోస్ట్‌గా తన చతుర్లతో కొత్త జోష్‌ నింపుతుంటారు షారుఖ్‌. అయితే తనలో ఆ కళ హీరో కాకముందు నుంచే ఉందన్న విషయం ఇటీవల బయటకొచ్చిన ఓ వీడియో ద్వారా అందరికీ తెలిసింది. షారుఖ్‌ 90వ దశకం తొలినాళ్లలో దూరదర్శన్‌ ఛానెల్‌లో ఓ సంగీత కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పటి వరకూ ఆ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఆ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ ఈమధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో షారుఖ్‌ ఆ కార్యక్రమంలో పాడటానికి వచ్చిన అప్పటి వర్ధమాన గాయకుడు కుమార్‌ సానును ప్రేక్షకులకు సరదాగా పరిచయం చేస్తూ కనిపించారు. ఆ వీడియో చూసిన వారు షారుఖ్‌లో ఆత్మవిశ్వాసం అప్పట్నుంచే కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, అదే ఆయన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని ప్రశంసిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.