ఒక్క చిత్రంతో సరి!

డి.వి.సుబ్బారావు ప్రసిద్ధి చెందిన రంగస్థల నటుడు. హరిశ్చంద్రుడి పాత్రకు పెట్టింది పేరు. పింగళి నాగేంద్రరావు నాటకం ‘వింథ్యరాణి’లో ప్రధాన పాత్రధారి. ఆ నాటకం జనాకర్షణ చేసిందని సినిమా తీశారు. జెమిని స్టూడియో సహకారంతో వైజయంతి సంస్థ వారు సి.పుల్లయ్య దర్శకత్వంలో తీశారు. పుష్పవల్లి, జి.వరలక్ష్మి, రేలంగి పాత్రధారులు. డి.వి. సుబ్బారావు తన పాత్రను తానే ధరించారు సినిమాలో. అయితే, సినిమా (1948) విడుదలై పరాజయం పాలైంది. ‘‘ఈ సినిమా నటనకీ నాకూ కుదరదు. ఆంగికం వద్దంటారు. గట్టిగా సంభాషణలు పలకవద్దంటారు. క్లోజప్, అంటారు. ఎవరూ పక్కనగాని, ఎదురుగాగాని వుండరు. ఇంకెప్పుడూ నన్ను సినిమాకి పిలవకండి’’ అని డి.వి.సుబ్బారావు ఒక్క చిత్రంతోనే నిశ్క్రమించారు సినిమా రంగం నుంచి.


- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.