అలా అర్జున్‌ ‘జెంటిల్‌మేన్‌’ అయ్యాడు

‘జెంటిల్‌మేన్‌’ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఓ సంచలనం సృష్టించింది. అర్జున్‌.. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. మరి అర్జున్‌ స్థానంలో చిరంజీవి అయితే ఎలా ఉండేదో కదా! ఎందుకంటే చిత్ర దర్శకుడు శంకర్‌ ముందుగా ఈ కథ కోసం తెలుగు హీరోనే అనుకున్నాడట. ఈ మేరకు చిరును సంప్రదించాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పటికే చిరు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, శంకర్‌ నూతన దర్శకుడు కావడంతో ఆలోచించారట చిరు. తర్వాత సున్నితంగా ఈ చిత్రానికి నో చెప్పారు. దాంతో అర్జున్‌ను ఎంపిక చేసుకున్నాడు శంకర్‌. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. అలా చిరు వదులుకున్న సినిమాలో నటించి అర్జున్‌ అదరగొట్టాడు. కె.జి. కుంజమోన్‌ నిర్మించిన ఈ చిత్రం 1993లో విడుదలలైంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.