పత్రికల వారికి గౌరవం

సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల ఓసారి విదేశ యాత్రలకు వెళ్లి తిరిగి వచ్చారు. ఆ సందర్భంగా ఆయనను పలు సంగీత బృందాలు ఆయన్ని సత్కరించాయి. ఆ తరువాత, ఆయన పత్రికలవారందరినీ ఆహ్వానించి విందు ఇచ్చారు. పాత్రికేయులు తనకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ విందు సమావేశంలో అందర్నీ గౌరవించారు కూడా. పత్రికల వారిని గుర్తు పెట్టుకుని ఇలా సత్కరించడం అప్పట్లో అరుదే. ఈ సందర్భంలో ఘంటసాల మాట్లాడుతూ, వీలున్నప్పుడల్లా ఇలా పత్రికల వారిని అభినందించే కార్యక్రమం సంప్రదాయంగా సాగాలని కోరారు.


- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.