ఇళయరాజా అరుదైన రికార్డు

సంగీతం, ఇళయరాజా.. రెండింటి గురించి విడిగా చెప్పలేం. అందుకే సంగీతం అంటే ఇళయరాజా, ఇళయరాజా అంటే సంగీతం అని ప్రస్తావిస్తుంటారు సంగీత అభిమానులు. రాజా ఏ పాటకు ట్యూన్‌ కట్టినా, ఏ పాటను ఆలపించినా మరో ప్రపంచంలోకి వెళ్లవలసిందే కదా. 90ల నాటి నుంచి ఇప్పటికి ఆయన సంగీతంలో ఎన్నో మధురగీతాలు జాలువారాయి. ఇళయరాజా అతి తక్కువ సమయంలో పాటలు అందించగలరనే విషయం తెలిసిందే. కానీ, 45 నిమిషాల్లో 8 పాటలకు స్వరాలు సమకూర్చారంటే నమ్మగలరా? దర్శకుడు ఆర్‌.కె.సెల్వమణి తెరకెక్కించిన తమిళ చిత్రం ‘చెంబరుతి’ (తెలుగులో చామంతి)కి సంగీతం అందించారు ఇళయరాజా. ఇందులోని 8 పాటలు కేవలం 45నిమిషాల్లో కంపోజ్‌ చేశారట రాజా. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఇదొక అరుదైన రికార్డు. 1992లో విడుదలైందీ చిత్రం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.