గూగుల్‌ ఇమేజెస్‌ తెచ్చిన జెన్నీ!

గూగుల్‌ అంటే తెలియని వారే లేరు. ఎలాంటి సమాచారాన్నైనా ఇట్టే వెతికి మనకు చేప్పేస్తుంది. ఇదంతా ఒకెత్తయితే ఫలానా ప్రాంతం లేదా ఫలానా సెలబ్రిటీ ఫోటో కూడా వెతికే సౌలభ్యం కూడా ఉంది. దీన్నే గూగుల్‌ ఇమేజెస్‌ అంటారు. అయితే ఈ సేవల్ని గూగుల్‌ ఎలా ప్రారంభించడానికి అమెరికా గాయని, నటి జెన్నీఫర్‌ లోపెజ్‌ కారణమైందని మీకు తెలుసా? ఎలాగంటే... 2000 సంవత్సరంలో జరిగిన గ్రామీ ఫంక్షన్‌కు జెన్నీ కూడా హాజరైంది. అప్పుడామె ధరించిన ఉల్లిపొరలాంటి దుస్తులు సభికులను విపరీతంగా ఆకర్షించాయి. జెన్నీ వేసుకొచ్చిన డ్రెస్‌ గురించి మరుసటి రోజు దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. దాంతో నెటిజన్లు జెన్నీ డ్రెస్‌ కోసం విపరీతంగా వెతికేసరికి కంప్యూటర్‌ సర్వర్లు సైతం క్రాష్‌ అయిపోయాయి. ఆ తరువాత గూగుల్‌ తన సెర్చ్‌ ఇంజన్‌లో ‘ఇమేజెస్‌’ను కూడా ప్రారంభించిందట. అంతేకాకుండా ఇందుకు గూగుల్‌ జెన్నీకి అభినందనలు కూడా తెలిపింది. ఇదీ గూగుల్‌ ఇమేజస్‌ కథ.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.