అందుకే ‘ఆదిత్య 369’లో కమల్‌ నటించలేదు

టాలీవుడ్‌ ఆణిముత్యాల్లో బాలకృష్ణ కథానాయకుడుగా సింగీతం శ్రీనివాస్‌ తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ ఒకటి. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో వచ్చిన తొలి సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. టైం మెషీన్‌ కథాంశంతో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి అందించారు సింగీతం. శ్రీ కృష్ణ దేవరాయ, కృష్ణ కుమార్‌గా బాలకృష్ణ తన నటనతో ఫిదా చేశారు. ఇలాంటి పాత్రల్లో మరో నటుడ్ని ఊహించుకోలేం కదా! అంతగా ఆకట్టుకున్నారు బాలయ్య. కృష్ణమోహన్‌గా కమల్‌ హాసన్‌ అయితే ఎలా ఉండేది? ఇప్పుడు ఆయనెందుకంటారా.. ఎందుకంటే? శ్రీ కృష్ణ దేవరాయగా బాలయ్య మాత్రమే నటించగలరని, తను మాత్రమే న్యాయం చేయగలడని ఆ పాత్రకు ఆయన్ను ఎంపిక చేశారు. కృష్ణ కుమార్‌ పాత్రకు కమల్‌ సరిపోతారని, ఈ ఇద్దరితో మల్టీస్టారర్‌గా తెరకెక్కిందామనుకున్నారు దర్శకనిర్మాతలు. అప్పటికి కమల్‌ మరో రెండు చిత్రాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టులో నటించేందుకు సాధ్యం కాలేదు. దాంతో బాలకృష్ణే రెండు పాత్రలు పోషించారు. కమల్‌ నటించి ఉంటే ఈ అద్భుత చిత్రం ఇంకెలా ఉండేదో!




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.