ఇదా? అదా?

సినిమాల ముగింపు సాధారణంగా శుభంతోనే. శుభంగా పూర్తయితే, కామెడీ అని, నాయికానాయకులు మరణిస్తే ట్రాజడీ అనీ అంటారు. సుఖాంతం, దుఃఖాంతం - అన్నమాట. కొన్ని సినిమాలు - దేవదాసు, లైలామజ్నూలాంటివి దుఃఖాంతం. దుఃఖాంతం అయితే ప్రేక్షకులు హర్షించరనీ, సుఖాంతంగానే వుండాలనీ చాలామంది ఆలోచిస్తారు. దుఃఖాంతం అయినా ‘దేవదాసు’ విజయవంతమైందని, ‘చిరంజీవులు’ తీస్తే నడవలేదు. ‘లైలామజ్నూ’లో నాయికనాయకులు ఎడారి తుఫానుకి మరణిస్తారు. కానీ, ఇద్దరూ స్వర్గంలో కలుసుకున్నట్టు - పాటపెట్టి సుఖాంతపు ముగింపు ఇచ్చారు. ఇలాంటి సందిగ్ధాల్లో కొందరు రెండు ముగింపుల్లా తీస్తారు. ‘అమావాస్య చంద్రుడు’ సినిమా సుఖాంతమే. కాని, ప్రేమికులిద్దరూ విడిపోతే ఎలా వుంటుందన్న ఆలోచనతో నిర్మాత కమలహాసన్‌, దర్శకుడు సింగీతం రెండు వెర్షన్‌లూ తీశారు. దుఃఖాంతం, సుఖాంతం పెద్ద వాళ్లలాంటివాళ్లు రెండు వెర్షన్లూ చూసి, సుఖాంతమే బాగుందన్నారు. గొప్పదర్శక నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ కూడా ఆ మాటే అన్నారుట. ఆయన అందులో అన్యమత ప్రేమని సమర్థించే పాత్ర ధరించారు. అంచేత ఆ సినిమాని సుఖాంతంగానే ముగించారు.

- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.