తారల పేర్లతో చీరెలు

ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందిన తారల పేర్లతో చీరెలు, గాజులు వచ్చేవి. కన్నాంబ చీరెలనీ, గాజులనీ, లోలాకులనీ, కాంచనమాల గాజులనీ, లోలాకులనీ వస్తే స్త్రీలు ఎగబడి కొనేవారు. భానుమతి పేరుతో కూడా కొన్ని వస్తువులు వచ్చేవి. భానుమతి తరువాత ఆ సంప్రదాయం పోయింది. ఇప్పుడు వస్తే బాగుంటుందని ఒక ప్రేక్షకుడు అన్నాడు ‘‘రకుల్‌ చినిగిన నిక్కర్లు, సమంత పాంట్లు అని నేటి తారల పేర్లతో వస్తే ప్రసిద్ధి చెందుతాయి’’ అని ఒక నిర్మాత అన్నారు.


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.