కట్టప్ప పాత్రను సంజయ్‌దత్‌ చేయాల్సిందట..


భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ‘బాహుబలి’ సినిమా ఎనలేని పేరు తెచ్చిందన్నది వాస్తవం. అయితే ఈ సినిమాలో బాహుబలితో పాటు సినిమాలో మరో కీలక పాత్ర కట్టప్ప. ‘బాహుబలి’ మొదటి భాగంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న యావత్తు రెండో సినిమా తెరపైకి వచ్చే వరకు ఓ పెద్ద చర్చే నడిచింది. అయితే తొలుత కట్టప్ప పాత్రకు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ను అనుకున్నారట. కానీ అప్పటికే సంజయ్‌ జైలులో ఉండడటం చేత ఆ పాత్రని కోల్పోయారట. బాహుబలి జులై 10, 2015న విడుదలై 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర కథారచయిత కేవీ విజయేంద్రప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా రూపొందించిన ఈ చిత్రంలో తొలుత అనుకున్న పాత్రలకు తరువాత తెరపైకి వచ్చే సరికి చాలా మార్పులు చోటుకున్నాయి. శివగామి పాత్రకు శ్రీదేవి, దేవసేన పాత్రకు నయనతారను అనుకున్నారట. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. విజయేంద్ర ప్రసాద్‌ అందించిన ‘బాహుబలి’ కథకు మొదట అనుకున్నది ఒకరిని తెరపైకి వచ్చేసరికి వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకవేళ సంజయ్‌దత్ కట్టప్ప పాత్ర పోషించించి ఉంటే ఎలా ఉండేదో..!



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.