చీర మారిస్తే మానేస్తానన్న దర్శకుడు!

జెమినివారు ‘మిస్‌ మాలిని’ పేరుతో తమిళంలో చిత్రం తీశారు - 1949లో. పుష్పవల్లి నాయిక. ఒక దృశ్యంలో ఆమె కట్టుకుని రావలసిన చీర ఏదో ఇచ్చి పంపారు. ఆమె అది కట్టుకోకుండా, ఇంకొకటి కట్టుకొని సెట్టుకి వచ్చింది. చిత్రం దర్శకుడు కె.రామ్‌నాథ్‌. ‘‘చెప్పిన చీర కాకుండా, ఈ చీర ఎందుకు కట్టుకొచ్చావు?’’ అని దర్శకుడు అడిగితే - ‘‘అది నాకు నచ్చలేదు’’ అంది. ‘‘మీకు నచ్చడం కాదు, దృశ్యానికి ఏది కావాలో అది కట్టుకోవాలి’’. ‘‘నేను కట్టుకోను. హీరోయిన్ని’’, ‘‘నేను దర్శకుడిని. నాకు కావలసినట్టు నటులు నడుచుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే మానేయండి. ఇంకొకర్ని పెట్టుకుంటాం’’. ‘నేను ఇక్కడ పర్మినెంట్‌ ఆర్టిస్టుని. నన్ను ఎవరూ తీయలేరు’’. ‘‘అయితే నేనే మానేస్తాను. ఇంకో దర్శకుడిని తెచ్చుకోండి’’ అని రామ్‌నాథ్‌ నిష్క్రమిస్తుండగా, విషయం విన్న నిర్మాత వాసన్‌ వచ్చి సర్దుబాటు చేసి, పుష్పవల్లి చేత చీర మార్పించారు.




- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.