కెమేరామేన్‌ నియమాలు

విజయవారి చిత్రాలకు ఛాయాగ్రాహణ దర్శకుడిగా పనిచేసిన మార్కస్‌ బార్‌ట్లీకి పని మీదనే ధ్యాస. సెట్లో చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఏదైనా లాంగ్‌ షాటు తీసినప్పుడు, లైటింగ్‌కి గంట కాలం పడుతుంది. ఆ టైములో సెట్లో ఎవరూ ఉండకూడదు - తన పరివారం తప్ప. కూచున్న వాళ్లు ఊరికే కూచోరు కదా, ఏదో నెమ్మదిగా మాట్లాడుకూంటూనే ఉంటారు. అది కూడా బార్‌ట్లీకి అభ్యంతరమే. అందరినీ, బయటికి వెళ్లి కూచోమని బార్‌ట్లీ అర్థించేవారు. దర్శకుడు కె.వి.రెడ్డితో సహా అందరూ సెట్టు బయటికి వెళ్లి కూచునేవారు - రమ్మని పిలిచే వరకూ.


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.