అదీ హ్యారీపాటర్‌ ప్రభావం!

బ్రిటిష్‌ రచయిత్రి జె.కె. రౌలింగ్‌ రాసిని ‘హ్యారీపాటర్‌’ నవలలు ఎంత ప్రాచుర్యం పొందాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ నవలలన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ఇక ఆ నవలల ఆధారంగా తీసిన సినిమాలన్నీ కలిసి 7.7 బిలియన్‌ డాలర్ల సొమ్మును వసూలు చేశాయి. అంతేకాదు, ఈ సినిమాల్లో మొదటిదైన ‘హ్యారీపాటర్‌ అండ్‌ ద సోర్సరర్స్‌ స్టోన్‌’ విడుదల అవగానే అందులోని పాత్రలన్నింటికీ ప్రాచుర్యం వచ్చేసింది. ఆ సినిమా విడుదల అయిన తర్వాత పుట్టిన 500 మంది అమ్మాయిలకు, అందులో హ్యారీపాటర్‌ స్నేహితురాలైన హెర్మాయిన్‌ పేరును పెట్టుకున్నారట తల్లితండ్రులు. ఇప్పటికా సంఖ్య ఇంకా పెరిగే ఉంటుంది లెండి!



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.