సమయస్ఫూర్తి!

‘ది బ్లూ ఏంజల్‌’ అనే సినిమా షూటింగ్‌ జరుగుతోంది. హీరోయిన్‌ మార్లిన్‌ డీట్రిష్‌ ఆ సన్నివేశంలో నటిస్తోంది. ఆమెకదే తొలి చిత్రం. అందులో ఒక సన్నివేశంలో ‘మెక్‌ క్లస్టర్‌ అరౌండ్‌ మీ, లైక్‌ మాత్స్‌ అరౌండ్‌ ఏ ప్లేమ్‌’ అనే డైలాగ్‌ చెప్పాల్సి ఉంది. అయితే ఆమె ‘మాత్స్‌’ అనే మాట పలుకుతున్నప్పుడు అది ‘మాస్‌’ అనేలా అందరికి వినిపిస్తోంది. డైలాగ్‌ను దర్శకుడు ఆమె చేత రకరకాలుగా ప్రాక్టీస్‌ చేయించినా, ఆమె ఆ పదాన్ని సరిగ్గా పలకలేకపోతుంది. అప్పటికే రెండురోజుల పాటు సుమారు 235 సార్లు రిహార్సల్స్‌ చేశారు. ఇక దర్శకుడు జోసెఫ్‌వాన్‌ స్టెర్న్‌బెర్గ్‌కు విసుగొచ్చేసింది. చివరకి ఆయన ఒక మ్యూజిషియన్‌ను పిలిచి, ఆమె ఆ డైలాగ్‌లో ‘మాత్‌’ అనే పదం పలికే సమయానికి ‘గెట్‌ మీ ఏ బీర్‌’ అని గట్టిగా కేకయ్యమని కోరాడు. అతను అలాగే చేశాడు. ఫలితంగా ఆ కథానాయిక ఆ పదాన్ని సరిగ్గా పలకలేకపోయిందన్న విషయం సినిమా చూసిన ఎవరికీ తెలియరాలేదు. అదీ సమయస్ఫూర్తి అంటే!

                               
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.