మన త్రీడీ సినిమా

మన దేశంలో నిర్మితమైన తొలి త్రీడీ చిత్రం ‘మైడియర్‌ కుట్టి చేతన్‌’. ఈ సినిమాకి నిర్మాత నవోదయా అప్పాచన్‌. జిజో పున్నోస్‌ దర్శకత్వం వహించారు. మలయాళంలో రూపొందించిన చిత్రం 1984లో విడుదలైంది. కళ్లజోడు పెట్టుకొని చూసే ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తెలుగులో ‘చిన్నారి చేతన్‌’గా అనువాదమైంది. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అశోక్‌కుమార్‌ వ్యవహరించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.