ఒక ముద్దు.. 37 టేకులు

చిత్రీకరణ సమయంలో టేకు మీద టేకు తీసకున్నారు అంటారు. దర్శకుడు ఒక సన్నివేశం తాను అనుకున్న విధంగా వచ్చే వరకూ పాత్రధారులతో నటింపజేయిస్తూనే ఉంటారు. అయితే కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకులు రెండుమూడు టేకులతో సరిపెట్టేస్తుంటారు. అవి సాధారణంగా బెడ్‌ రూమ్‌ దృశ్యాలు, ముద్దు సన్నివేశాల్లాంటివి అయి ఉంటాయి. అయితే ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సుభాష్‌ ఘయ్‌ మాత్రం తాను ఏ దశలోనూ రాజీపడను అన్నట్లు ఓ సన్నివేశం తీశారు. ఆయన ‘కాంచి’ చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తీక్‌ ఆర్యన్‌, మిస్తీ చక్రవర్తి నాయకానాయికలు. వీరిద్దరిపై ఓ చుంబన దృశ్యాన్ని చిత్రీకరించారు. ఆ నటీనటులు ముద్దు విషయంలో కాస్త బిడియపడ్డారట. ఆ తత్తరపాటులో సరిగా రాలేదని భావించి కట్‌ చెప్పేసి మళ్లీ ముద్దుపెట్టుకోమన్నారట. అలా కార్తీక్‌, మిస్తీలు మొత్తం 37 టేకులు తిన్న తర్వాతగానీ సుభాష్‌ అనుకున్న విధంగా ముద్ద రాలేదట. అంతసేపు ముద్దులాట చూసి చిత్రీకరణ బృందం రకరకాల జోకులు వేసుకున్నారట.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.