మేకప్‌కు రికార్డా?

మల్‌ హాసన్‌.. తనను తాను మలుచుకునే నటుడు. ఏ వయసు పాత్ర చేయడానికైనా సిద్ధమవుతాడు. శంకర్‌.. తమిళ, తెలుగు ప్రేక్షకులకు గ్రాఫిక్స్‌ను పరిచయం చేస్తూ తన సినిమాలతో సమాజానికి సందేశం ఇచ్చే దర్శకుడు. అలాంటి వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘భారతీయుడు’ చిత్రం తెలియజేసింది. ఇందులో కమల్‌ ద్విపాత్రాభినయంతో నట విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. తండ్రి, కొడుకులుగా కమల్‌ చేసిన నటన మర్చిపోగలమా? ఈ రెండిటిలో వృద్ధుని పాత్రకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆ పాత్రను సహజంగా చూపించేందుకు ‘ప్రోస్తెటిక్‌’ అనే ప్రత్యేకమైన మేకప్‌ వేశారట. అయితే అప్పటి వరకు ఇలాంటి మేకప్‌ ఎవరు వాడలేదు. శంకర్‌ బృందం దీనిపై దృష్టి పెట్టడంతో..ఈ మేకప్‌ వినియోగించిన తొలి భారతీయ సినిమాగా ‘భారతీయుడు’ రికార్డు సృష్టించింది.










Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.