బాలీవుడ్‌ హీరో దెబ్బకు రష్యా ప్రధాని ర్యాలీ రద్దు

ముందుతరం బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుల్లో మిథున్‌ చక్రబర్తి ఒకరు. ఆయన డ్యాన్సులకు ప్రేక్షకులు ఊగిపోయేవారు. మిథున్‌ నటించిన ‘డిస్కో డ్యాన్సర్‌’ ఆయనకు స్టార్‌డమ్‌ కట్టబెట్టింది. ఇండియాతో పాటు రష్యా సహా ఇతర సోవియట్‌ దేశాల్లో ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా రష్యాలో ఆయన క్రేజ్‌ ఆకాశాన్నంటింది. ఎంతోమంది తన డ్యాన్సులకు అభిమానులుగా మారిపోయారు. ఓసారి మిథున్‌ రష్యాకు వస్తున్నారని అక్కడివారికి తెలిసింది. ఆయన్ను చూసేందుకు జనం తండోపతండాలుగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అదే రోజే అక్కడ రష్యా ప్రధాని ర్యాలీ జరగాల్సిఉంది. అయితే మిథున్‌ను చూడటానికే జనాలు ఆసక్తి చూపడంతో ర్యాలీని పట్టించుకునేవారు కరవయ్యారు. దీంతో ప్రధాని చేసేదేం లేక ర్యాలీని రద్దు చేసుకుని వెళ్లిపోయారట.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.