మేకప్‌లు లేని ‘ముత్యాల ముగ్గు’


బాపు రమణల ‘‘ముత్యాల ముగ్గు’’లో హనుమంతుడికి తప్ప ఇంకెవరికీ మేకప్‌లు లేవు. ఆ సినిమా ఛాయాగ్రాహకుడు ఇషాన్‌ఆర్య మేకప్‌లు ఒప్పుకోరు. ‘గరమ్‌ హవా’ సినిమా ఛాయాగ్రాహకుడిగా ఆయనకు జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. ఒక సినిమాలో... ఎన్‌.టి.ఆర్‌ హీరో. ఆయన విగ్గు, మేకప్, లిప్‌స్టిక్‌తో వస్తే ఇషాన్‌ ఆర్య ఆ సినిమా చెయ్యనని వెళ్లిపోయారు! 1968లో షర్మిలా టాగూర్, సంజీవ్‌ కుమార్‌లతో ‘నయా జనమ్‌’ అనే హిందీ సినిమాకి ఇషాన్‌ ఆర్య పనిచేశారు. పూర్తి అయిన ఆ సినిమా, విడుదల కాలేదు!

- రావి కొండలరావుCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.