రామ్‌ చరణ్‌ వద్దంటే.. నాని చేశాడట

కథానాయకుడు నటించాల్సిన చిత్రంలో మరో హీరో నటించడం సహజం. ఇందుకు ఎన్నో కారణాలుండొచ్చు. ప్రముఖ నటులు రామ్‌ చరణ్, నాని విషయంలో ఒకప్పుడు ఇదే జరిగింది. గతంలో చెర్రీ నటించాల్సిన ఓ ప్రేమకథలో నాని నటించి యువత హృదయాల్ని హత్తుకున్నాడు. అదే సినిమా అంటే? ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముందుగా చెర్రీని కథానాయకుడుగా అనుకున్నారట. డేట్స్‌ సర్దుబాటు కాకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించాడట చరణ్‌. దాంతో ఈ ప్రేమకథలో నటించే అవకాశం నానిని వరించింది. నానికి కథ బాగా నచ్చడంతో ఓకే చేశాడు. అలా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ అంటూ సమంతను ఉద్దేశించి ‘ప్రియమతా నీవచట కుశలమా’ అని ఆలపించిన గీతం ఎప్పటికీ మర్చిపోలేము కదా!



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.