తియ్యని సినిమా

‘న్యూ ఢిల్లీ’ అని హిందీ సినిమా (1954-55). అందులో కిశోర్‌ కుమార్, వైజయంతి మాల నటులు. సినిమా హిట్టు. ఆ సినిమాని తెలుగులో తియ్యాలని విజయవారు హక్కులు కొన్నారు. డి.వి.నరసరాజు పూర్తిగా స్క్రిప్టు రాశారు. అయితే, అది కొన్ని సంవత్సరాలు పాటు తియ్యకుండా అలాగే వుంది. ‘‘కులాలు, గొడవలూ మనకెందుకూ?’’ వద్దన్నారు చక్రపాణి. పూర్తిగా స్క్రిప్టు వుందని విజయచిత్ర పత్రిక సీరియల్‌గా ప్రచురించింది. ‘కాలం మారింది మనషులే మారాలి’ అనిపేరు. విజయచిత్రలో చదివి, సారధివారు తమకి హక్కులు ఇస్తే తీస్తామని విజయ సురేష్‌ వారితో మాట్లాడి కొన్నారు. కె.యస్‌.రామరెడ్డి దర్శకుడిగా, రాజేశ్వరరావు సంగీత దర్శకుడిగా పనులు ఆరంభమైనాయి. అంతలో నిర్మాత తల్లి చనిపోవడంతో, నిర్మాణం మూలపడిపోయింది. అయితే, ఆ చిత్రంపేరు రెండుగా చీలి, రెండు చిత్రాలు వచ్చాయి. కథకి సంబంధం లేదు. ‘కాలం మారింది’ అని ఒక సినిమా, ‘మనషులు మారాలి’ అని ఇంకో సినిమా.


- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.