ఎన్‌.టి.ఆర్‌ అలా దొరికారు!

‘గృ
హప్రవేశం’ 1946లో విడుదలైంది. కళాదర్శకుడు కళాధర్‌కి ఇది తొలి సినిమా. ఈ సినిమా తరువాత, కొత్తనటుల కోసం అన్వేషించాలనీ ప్రతిభగలవారు దొరకుతారనీ ప్రసాద్‌ - ప్రకటన వేసి, 5 కేంద్రాలు తిరిగారు. ఆయనతోపాటు కళాధర్‌ కూడా వెళ్లారు. కళాధర్‌ చెప్పిన విషయమిది... ‘‘బెజవాడ, విశాఖపట్నం, ఏలూరు మొదలైన ఊళ్లు ప్రసాద్‌ తిరిగితే, నేనూ వెంటవెళ్లాను. విజయ సంస్థ ఆరంభం కానున్న తరుణంలో నెలజీతాల మీద నటీనటుల్ని తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. అప్పుడే ఎన్‌.టి.రామారావు కనిపించారు. బెజవాడలో, ఒక డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసుకి రమ్మని ఇచ్చిన ప్రకటన చూసి కొందరు నటులు వచ్చారు. వాళ్లలో ఒకరు ఎన్‌.టి.రామరావు. ప్రసాద్‌ రామారావుని చూసి ముచ్చటపడి, వివరాలు అడిగారు. రంగస్థలానుభవం ఉందని చెప్పగా, రూపురేఖలు బాగున్నాయని చెప్పి, తరువాత మద్రాసు రప్పించారు ప్రసాద్‌. అనుభవం వస్తుందని ‘మనదేశం’ (1949)లో, ఇన్స్‌పెక్టర్‌ పాత్ర వేయించారు. అలా, అభించారు రామరావు - తెలుగు సినిమాకి’’.

- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.