20వ శతాబ్దంలో ఒకే ఒక్కడు

ప్రపంచ సినిమాకు సంబంధించి ఆస్కార్‌ పురస్కారాలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. అయితే ఆస్కార్‌ విజేతల ఎంపికలో వర్ణ వివక్ష చోటుచేసుకుంటోందంటూ గత కొన్నేళ్లుగా విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో నిజమెంతో తెలియదు కానీ... ఇప్పటివరకూ ఆస్కార్‌ గెలుచుకున్నవారి జాబితా చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. 20వ శతాబ్దంలో... అంటే ఆస్కార్‌ పురస్కారాలు ప్రారంభమైన 1929 నుంచి 1999 వరకు ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నవారిలో ఒకే ఒక్క నల్లజాతి నటుడు ఉన్నాడు. అతనే సిడ్నీ పొయిటెర్‌. ‘లిలీస్‌ ఆఫ్‌ ది ఫీల్డ్‌’ చిత్రానికిగానూ 1964లో ఉత్తమ ఈ పురస్కారం అందుకున్నారు. ఆయన తర్వాత మళ్లీ 2001లో మరో నల్లజాతి నటుడు డెంజల్‌ వాషింగ్టన్‌ ‘ట్రైనింగ్‌ డే’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ గెలుచుకున్నారు. 89 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో ఇప్పటివరకు ఉత్తమ నటుడిగా నెగ్గిన నల్లజాతి నటులు నలుగురే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.