పేపర్‌బాయ్‌ కథ!

కొంతమంది వైద్యవిద్యార్థులు కలిసి 1953-55 మధ్య ‘పేపర్‌బాయ్‌’ పేరుతో మలయాళంలో సినిమా తీశారు. వాళ్లెవరికీ సినిమా నిర్మాణం గురించి అవగాహనలేదు. కానీ, ఉత్సాహంతో, ప్రయోగాత్మకంగా తీశారు. నేను అప్పుడు త్రివేండ్రంలో డబ్బింగ్‌ సినిమా రాస్తున్న సమయం. నేను ఎడిటింగ్‌ రూములో ఉన్నప్పుడు అదే ఎడిటర్‌ దగ్గరకి ఆ విద్యార్థులంతా వచ్చారు చేతిలో పుస్తకాలతో. అడిగితే చెప్పారు, వాళ్లు పదిమందట. తలా పదివేలు వేసుకుని, సినిమా తీస్తున్నారట. వాళ్లలో ఒకరు దర్శకుడు. పాటలు లేవు, మేకప్‌ లేదు. ఇంటింటికీ పేపర్లు పంచే ఒక అబ్బాయిని పట్టుకుని అతని చేతనే ఆ వేషం వేయించారుట. అతను స్కూల్లో చదువుకుంటూ, ఉదయమే వార్తాపత్రికలు అందజేసి, నాలుగురాళ్లు సంపాదించి, తన చదవుకి ఉపయోగిస్తున్నట్టు సాగుతుంది కథ. ఆ సినిమా తర్వాత విడుదలయింది కూడా. కానీ... ఎంతమంది చూశారో తెలీదు.
- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.