నిజంగా నడుము చూడలేదు..

పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లో విజయవంతమైన అనేక చిత్రాల్లో ‘ఖుషీ’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానముంది. పవన్‌.. భూమిక జంటగా నటించిన ఈ చితాన్ని ఎస్‌.జె.సూర్య తెరకెక్కించారు. కొత్తదనం నిండిన సరికొత్త ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో దక్షిణాదిలో సినీప్రియుల హృదయాలు కొల్లగొట్టింది. ముఖ్యంగా ఆ చిత్రంలోని పాటలకు, పవన్‌ లవ్‌ - యాక్షన్‌ హంగామాకు కుర్రకారు ఉర్రూతలూగిపోయింది. ఇక ముఖ్యంగా ఆ సినిమాలో పవన్‌.. భూమిక నడుము చూసే సన్నివేశం చాలా హైలైట్‌ అయ్యింది. అయితే ఈ రొమాంటిక్‌ సీన్‌ వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. నిజానికి తెరపై అంత చక్కగా పండిన ఆ సన్నిశం వెనుకు పవన్‌ అత్యద్భుతమైన నటన దాగి ఉందట. పవన్‌ భూమిక నడుమును చూసే సన్నివేశాలను ఆ సమయంలో ఆయన ముఖంలో పలికిన హావభావాలు చూస్తే నిజంగా భూమికను పవన్‌ ఎదురుగా కూర్చోబెట్టి ఆ సన్నివేశం చిత్రీకరించారేమో అనిపిస్తుంది. కానీ, వాస్తవమేంటంటే పవన్‌ నిజంగా ఆమె నడుమును చూడలేదట. సూర్య పవన్‌ను ఓ బల్లపై కూర్చోబెట్టి ఎదురుగా భూమిక ఉన్నట్లు, ఆమె నడుమును చాటుగా గమనిస్తున్నట్లుగా చేసి చూపమన్నారట. అలా షూట్‌ చేసిన సన్నివేశాన్నే తర్వాత భూమిక సన్నివేశాలతో కలిపి చూపించారు. అంతేకాని ఆ ఎపిసోడ్‌లో చూపించినట్లు పవన్‌.. భూమిక నడుమును నిజంగా చూడలేదు. కానీ, తెరపై ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు ఎంతో వాస్తవికంగా కనిపిస్తుంటుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.