శత దినోత్సవానికి పోటెత్తిన జనం

ప్పుడైతే చాలా కాలంగా శత దినోత్సవాలు లేవుగాని, ఆ రోజుల్లో జరిగేవి. నటీనటులు, టెక్నీషియన్లు అందరూ ముఖ్య పట్టణాలకి వెళ్లేవారు. మరీ కుదరకపోతే, బెజవాడలో మాత్రం ఉత్సవం పెట్టేవారు. ‘పెళ్లిచేసి చూడు’ (ఈ సినిమా ఫిబ్రవరి 29, 1952లో విడుదలైంది. జూన్‌ 8వ తేదీన విజయవాడలో శతదినోత్సవం చేసుకుంది.) దుర్గాకళామందిరంలో ఉత్సవం ఏర్పాటు చేస్తే ఆ వీధి వీధంతా జనమేనట! ఆ ఉత్సవానికి ప్రత్యేకంగా వెళ్లిన కొడవటి కుటుంబరావు చెప్పారు... ‘‘ అందరూ వచ్చారుగానీ, ఎన్‌.టి.రామారావు మాత్రం రాలేదు. షూటింగ్‌ ఒత్తిడిలో ఉండిపోయారు. నాగిరెడ్డి, చక్రపాణి, దర్శకుడు ప్రసాద్, బార్‌ట్లీ, గోఖలే, ఘంటసాల, రంగారావు, సావిత్రి, జోగారావు వచ్చారు. రామారావు రాకపోవడంతో జనం నిరుత్సాహంతో కేకలు వేశారు. ఇంటర్వెల్‌ సమయంలో నటీనటులు బాల్కనీలో నించుని ప్రేక్షకులకి కనిపించారు. ఘంటసాల ‘మనదేశం’లోని ‘జయ జనని పరమ పావని’ పాటని ప్రార్థన గీతంగా పాడారు. 11 థియేటర్లలో 100 రోజులు ఆడితే, ఆ థియేటర్ల వాళ్లంతా బెజవాడకే వచ్చి షీల్డులు అందుకున్నారు. నటీనటులు సభలో మాట్లాడారు. ప్రేక్షకాదరణ విపరీతం. శతదినోత్సవాల సంప్రదాయం ఎలా ఆరంభమైందోగాని, ఆ ఉత్సవం, జన సందోహం మరచిపోలేనివి!


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.