అలా ‘పిల్లా నువ్వులేని’ సాంగ్‌ సెట్‌ అయింది

క కథానాయకుడు కోసం రాసుకున్న కథ మరొక హీరోతో చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది దర్శకులకు. దానికి కారణాలు చాలా ఉంటాయి. సంగీత దర్శకులకు అప్పుడప్పుడు ఇలానే జరుగుతుంటుంది. ఓ చిత్రానికి కట్టిన బాణీ మరో సినిమాకు ఉపయోగపడుతుంది. బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌గా నిలుస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ స్వరకల్పనలో వచ్చిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ పాట ఇదే కోవలోకి వస్తుంది. ‘పిల్లా అట్ట నవ్వేసేసి పారిపోమాకే బాబు.. మీరేంట్రా! నన్ను చూస్తున్నారు, ఎవడి డప్పు ఆడు కొట్టండెహే!!’’ అంటూ పవన్‌ కల్యాణ్‌ చెప్పే మాటలతో మొదలయ్యే పాట ఎంత హుషారెత్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంగీత ప్రియుల్ని ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ ఆ బీట్‌ వింటే డ్యాన్స్‌ చేయాల్సిందే. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్‌ సింగ్‌’లోని గీతమిది. అయితే ముందుగా ఈ పాటను వేరే చిత్రం కోసం స్వరపరిచాడు డీఎస్పీ. ఆ సినిమా కథలో ఈ మాస్‌ బీట్‌ పెట్టే అవకాశం రాలేదు. కొంతకాలం తర్వాత హరీశ్‌- పవన్‌ కాంబినేషన్‌లో ‘గబ్బర్‌ సింగ్‌’ ప్రారంభమైంది. ఊపేసే సాంగ్‌ ఒకటి సిద్ధం చేయాలని హరీష్‌.. దేవీకి చెప్పడంతో ‘పిల్లా నువ్వులేని జీవితం’ వినిపించాడు. వెంటనే ఓకే చేశాడు హరీష్‌. అయితే అప్పటికి పల్లవి మాత్రమే ఉండటంతో చరణాలు సైతం రాసే బాధ్యత దేవీనే తీసుకున్నాడు. సంచలనం సృష్టించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.