రజనీకి తల్లి శ్రీదేవి..

తి‌లోక సుందరి శ్రీదేవి తెలుగు, తమిళం, హిందీ చిత్రసీ‌మల్లో అగ్రక‌థా‌నా‌యి‌కగా ఓ వెలుగు వెలి‌గింది.‌ తమిళ సూప‌ర్‌స్టార్‌ రజ‌నీ‌కాంత్‌తోనూ ఆమె విజ‌య‌వం‌త‌మైన చిత్రాల్లో నటించి ఆయనకు హిట్‌పె‌యి‌ర్‌గా పేరు‌తె‌చ్చు‌కుంది.‌ కానీ రజ‌నీకి శ్రీదేవి తల్లిగా నటిం‌చిం‌దంటే నమ్మ‌గ‌లరా? అయితే అది సవతి తల్లి పాత్ర.‌ అందు‌లోనూ శ్రీదే‌వికి పద‌మూ‌డేళ్ల వయ‌సు‌న్న‌ప్పుడే ఆ పాత్ర చేయడం విశేషం.‌ కె.‌బాల‌చం‌దర్‌ తెర‌కె‌క్కిం‌చిన ‌‘మూండ్రు ముడిచ్చు’‌లో రజనీ, శ్రీదేవి సవతి తల్లి, కుమా‌రు‌లుగా నటిం‌చారు.‌ దురు‌ద్దే‌శంతో తనను తన ప్రియుడి నుంచి వేరు‌చే‌సిన రజ‌నీపై పగ తీర్చు‌కు‌నేం‌దుకు రజనీ తండ్రిని వివాహం చేసు‌కుని సవతి తల్లిగా మారు‌తుంది శ్రీదేవి.‌ ఈ చిత్రం తర్వాత వచ్చిన పలు చిత్రాల్లో రజనీ, శ్రీదేవి నాయకానాయికలుగా నటిం‌చారు.‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.