జపనీయులకు మత్తు... మన రజనీ ‘ముత్తు’
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘ముత్తు’ చిత్రంతో జపనీయులకు ఆరాధ్య నటుడయ్యారు. యువతరం జపనీయులు రజనీ చిత్రాలు చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీరిలో దాదాపు అరవై శాతం యువతులే! పాటలకు రజనీ వేసే స్టెప్పులన్నా, మ్యానరిజం అన్నా వీరికి తగని మక్కువ. రజనీ జపనీయులకు ఎలా తెలిశారంటే... జూన్‌ ఎడోకి అనే జపాన్‌ విమర్శకుడు ఒకసారి సింగపూర్‌ ‘లిటిల్‌ ఇండియా’ మార్కెట్లో షాపింగ్‌ చేస్తూ మంచి భారతీయ సినిమా చెప్పమంటే, ఆ షాప్‌ యజమాని ‘ముత్తు’ సినిమా ఇచ్చాడు. అది అతడికి బాగా నచ్చింది. ఎడోకి భార్యకి ఎంతగానో నచ్చి అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. అలా ఆ విషయం స్థానిక ఇచ్చికవ, జనడియక్స్‌ సంస్థలు ముందుకొచ్చి ముత్తు చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తే, అదిరే కలెక్షన్లతో హాళ్లు నిండిపోయాయి. ఇక అక్కడి నుంచి రజనీ సినిమాలు ఇండియాతోపాటు జపాన్లో కూడా సమాంతరంగా విడుదలవుతున్నాయి. రజనీ మనకే కాదు జపనీయులకు కూడా సూపర్‌ స్టారే!

- రావి కొండలరావుCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.