ఆ విషయంలో ‘బాబా’ తర్వాత ‘పేట’నే

మరణం మాసు మరణం.. టఫ్‌ తరుణం.. అతడి పేరే మనకు శరణం.. అనిపించి ‘పేట’ చిత్రంతో అభిమానుల్ని ఓ ఊపు ఊపాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. కార్తీక్‌ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రమిది. త్రిష, సిమ్రన్‌ నాయికలు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం అందుకుందీ చిత్రం. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం...* అందుకే ఖైదీ నం: 165

'పేట' చిత్రంలోని ఓ సన్నివేశంలో రజనీకాంత్‌ను జైలులో పెడతారు. దుస్తులపై ఖైదీ నం.165 అని ఉంటుంది. 'పేట' చిత్రం రజనీకాంత్‌ 165వ సినిమా. అందుకే ఖైదీ నం.165 అని పెట్టారు.


* ఫైట్‌ కోసం 50 రోజుల శిక్షణ

ఈ చిత్రానికి సంబంధించిన పోరాటాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పీటర్‌ హెయిన్‌ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఫైట్స్‌ అద్భుతంగా నిలిచాయి. ఇందులోని ఓ ఫైట్‌ కోసం రజనీ 50 రోజులపాటు శిక్షణ తీసుకున్నారు.* 'బాబా' తర్వాత 'పేట'లోనే..

2002లో విడుదలైన 'బాబా' సినిమా తర్వాత 'పేట' చిత్రంలోనే 'సూపర్‌స్టార్‌ రజనీ' అనే ఒరిజినల్‌ గ్రాఫిక్‌ టైటిల్‌ కార్డును ఉపయోగించారు. అలాగే 1997లో విడుదలైన 'అరుణాచలం' సినిమా తర్వాత ఈ సినిమాలోనే ఒరిజినల్‌ గ్రాఫిక్‌ టైటిల్‌ కార్డుకు అనుగుణంగా ఒరిజినల్‌ సౌండ్‌ట్రాక్‌ను ఉపయోగించారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.