రాజ్‌కుమార్‌ సరసన... తెలుగు తారలు
న్నడ చిత్రాల్లో ప్రముఖ నాయక పాత్రధారిగా ఖ్యాతిపొందిన రాజ్‌కుమార్‌ చిత్రాల్లో కన్నడతారలు నాయిక పాత్రలు ధరించినా, తెలుగువారు కూడా నటించారు. రాజ్‌కుమార్‌తో వివిధ చిత్రాల్లో నటించిన తెలుగు హీరోయిన్లు; జి.వరలక్ష్మి, షావుకారు జానకి, జూనియర్‌ శ్రీరంజని, జమున, కృష్ణకుమారి, రాజశ్రీ, వాణిశ్రీ, భానురేఖ, కాంచన, చంద్రకళ, జయచిత్ర, జయప్రద, లక్ష్మి, సుమలత - మొదలైనవారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ హీరోయిన్లు ఎవరికీ డబ్బింగ్‌ లేదు! అందరూ వారి కంఠాలతో కన్నడ భాష మాట్లాడారు!


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.