దర్శకుడు అవ్వాలనుకున్నా కానీ..

రావు గోపాలరావు తనయుడిగా తెరంగ్రేటం చేసినా తన నటనతో ప్రత్యేకత చాటుకున్నారు రావు రమేశ్‌. బాలకృష్ణ కథానాయకుడుగా తెరకెక్కిన ‘సీమసింహం’తో టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు రమేశ్‌. ‘కొత్త బంగారు లోకం’, ‘గమ్యం’ చిత్రాలో పోషించిన పాత్రలు నటుడిగా ఆయనకు పేరు తీసుకొచ్చాయి. విలక్షణ నటన ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించారు. మరి ఇలాంటి నటుడికి నటన అంటే అంతగా ఆసక్తి లేదంటే నమ్మగలమా! ఎందుకంటే.. రావు రమేశ్‌ ముందుగా దర్శకుడు అవుదామనుకున్నారట. ఈ విషయంలో వాళ్ల అమ్మకి చెప్పగా.. దర్శక్వతం అంటే 24 విభాగాలుంటాయి. డైరెక్టర్‌ అంటే లెన్స్‌లు తెలిస్తే చాలదు, జీవితం తెలియాలి. ముందు ముళ్ల బాట ఉంటది. తర్వాత వెలుగు కనిపిస్తుంది. ప్రస్తుతం నటించు. నీకు నటన చాలా తేలిక అని సమాధానం ఇచ్చారట. అలా దర్శకుడు కావాల్సిన నేను నటుడయ్యానని ఓ సందర్భంలో చెప్పారు రావు రమేశ్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.