గాత్ర వైవిధ్యం

న కంఠంతో ఏ వయసువారికైనా పాడగల ప్రజ్ఞ ఒక్క యస్‌.జానకి దగ్గరే ఉంది. ‘ఊదిరి పూక్కళ్‌’ అనే తమిళ సినిమాలో జానకి ఒక వృద్ధురాలికి కంఠం వణికిస్తూ పాడింది. ‘రుసి కండపూవై’లో మూడేళ్ల పాపకి పాడింది. ‘నెంజత్తై కిళ్లాదె’లో పద్నాలుగు సంవత్సరాల అబ్బాయికి పాడింది. ఆ అబ్బాయే పాడాడు అనుకున్నారు అందరూ. ‘పదహారేళ్ల వయసు’, ‘సప్తపది’ సినిమాల్లో ఆమె ఇలా వెరైటీగా పాడిన పాటలు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాయి. అది ఆమె ప్రతిభ!- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.