ఆ పాటల వెనక... విదేశీయ ప్రభావం

ఒక సందర్భంలో సంగీత దర్శకుడు రాజేశ్వరరావు చెప్పినది: ‘‘ఏదేశ సంగీతమైనా బాగుందంటే స్ఫూర్తి పొంది మన తెలుగుపాటలు చేసుకోవచ్చును. ఉదాహరణకు - ‘భార్యాభర్తలు’లో ‘‘జోరుగా ఉషారుగా షికారు చేదమా’’, ‘ఇద్దరుమిత్రులు’లోని ‘‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’’, ‘‘హలో హలో ఓ అమ్మాయి’’, ‘‘ఓహో..ఒహో..నిన్నే కోరగా’’ పాటలు పాశ్చాత్య సంగీత ప్రభావంతో చేసినవే. అయితే, అవి అలా అనిపించవు. తెలుగు పాటలే అనిపిస్తాయి. అలా, తెలుగుపాటల్లా చెయ్యగలిగితే, ఏ విదేశీయ సంగీతం నుంచైనా స్ఫూర్తి పొందవచ్చు’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.