సమంత తెర వెనక పేరు తెలుసా?

‘జెస్సీ ’ (ఏమాయ చేసావే)గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై యువకుల హృదయాలు దోచుకుంది సమంత. రామలక్ష్మి(రంగస్థలం), శ్రావణి(మజిలీ), బేబీ,స్వాతి(ఓ బేబీ),జానకి(జాను) వంటి పాత్రలకు ప్రాణం పోసి తెలుగు తెరపై తనదైన ముద్ర వేసింది. అందం, అభినయంతో అలరించే సమంత .. నాగ చైతన్యను వివాహమాడింది. అప్పటి నుంచి సమంత అక్కినేనిగా మారింది. అంతకు ముందు సమంత రూత్‌ ప్రభు, సామ్‌ అని పిలిచే వాళ్లు అభిమానులు. మరి తెర వెనక సమంతను ఏమని పిలుస్తారో తెలుసా? పాఠశాలలో, కళాశాలలో, ఇంట్లో సమంత పేరు.. యశోద. ప్రస్తుతం తమిళ నటుడు విజయ్‌ సేతుపతి సరసన విఘ్నేష్‌ దర్శకత్వంలో నటిస్తుంది సామ్‌. తొలిసారి మరో నాయిక నయనతారతో తెర పంచుకుంటుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.