‘సమ్రాట్‌ అశోక్‌’లో ఒక్కొక్కరూ పలు పాత్రలు

న్‌.టి.రామారావు స్వీయ దర్శకత్వంలో ‘సమ్రాట్‌ అశోక్‌’ (28/05/1992) నిర్మించారు. ఇందులో ఆయన, భానుమతి ముఖ్యులు. అయితే, అక్కడక్కడ వచ్చే పాత్రల్ని ధరించిన వాళ్లే మళ్లీ మళ్లీ ధరించారు. అంటే ఒక పదిమంది ఉపనటుల్ని తీసుకొని వాళ్ల చేతనే 50, 60 పాత్రలు ధరింపజేశారు. చాలామందిని గుర్తుపట్టవచ్చు. అలాగే ‘విశ్వామిత్ర’లో కూడా విశ్వామిత్రుడి శిష్యులుగా వేసిన వాళ్లే, హరిశ్చంద్రుడి పరివారంలోనూ కనిపిస్తారు. చాలా కాలంగా తండ్రి పాత్రల్లో రాణిస్తున్న చలపతిరావు ‘దానవీర శూరకర్ణ’లో ఐదు పాత్రల్లో కనిపిస్తాడు. అయితే అప్పుడు చలపతిరావు తెలియదు గనక, గుర్తు తెలియదు. ఇప్పుడు చూస్తే గుర్తు పడతాం.


- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.