ప్రచార పర్వం... గిన్నిస్‌ హారం

కాదేదీ ప్రచారానికి అనర్హం అనేలా... సినిమాకు సంబంధించిన ప్రతి వేడుకను వినూత్నంగా నిర్వహిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు సినిమా జనాలు. బాలీవుడ్‌లో అయితే ఈ ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పాటల విడుదల వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ చిత్రాల్లానే వాటి ప్రచార కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో ఉంటాయి. గతంలో రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణెలతో ఆయన ‘బాజీరావ్‌ మస్తానీ’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆ సినిమా పాటల వేడుకనూ అదే స్థాయిలో ఆర్భాటంగా నిర్వహించారు. ఆ చిత్రంలోని ‘గజాననా...’ పాటను విడుదల చేసే విషయంలో ప్రత్యేకత చాటుకున్నారు భన్సాలీ. ఐదు వేల మంది విద్యార్థులను సమీకరించి పుణెలోని ఓ స్టేడియంలో వినాయకుడి ఆకారంలో మానవహారం రూపొందించారు. దేవతల ఆకారంలో రూపొందిన అతిపెద్ద మానవహారంగా దీనికి గిన్నిస్‌ రికార్డు దక్కడం విశేషం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.