‘వాంప్‌’ హీరోయిన్ల్లు

సినిమాల్లో హీరోయిన్, వాంప్‌ - అని రెండు పాత్రలుండడం అలవాటు. వాంప్‌కి తెలుగుమాట చెప్పలేం. క్రూరత్వం కాదుగాని, పంతం వుంటుంది. హీరోని ప్రేమించిందనుకుందాం, హీరో తృణీకరిస్తే అతని మీద పగపడుతుంది. అతను ప్రేమిస్తున్న అమ్మాయిని హింసపెడుతుంది. ఇలాంటి పాత్రలు ధరించిన వాళ్లు - హీరోయిన్లుగా మారి ఉదాత్తమైన పాత్రలు ధరించారు. సావిత్రి మొదట్లో వాంప్‌. ‘వదిన’, ‘చంద్రహారం’, ‘శాంతి’ వంటి చిత్రాల్లో అలాంటి పాత్రలే ధరించారామె. అంజలిదేవీ అంతే. ప్రవేశమే అలాంటి వాంప్‌ పాత్రతో. ‘గొల్లభామ’, ‘బాలరాజు’, ‘కీలుగుర్రం’ మొదలైన సినిమాల్లో అలాంటి స్వభావం గల పాత్రలు ధరించాక ‘శ్రీ లక్ష్మమ్మ కథ’లో నాయిక పాత్ర ఇస్తే అందరూ ఆశ్యర్యపోయారు. ఆమె పనికిరాదన్నారు. కానీ ఆమె తన ప్రతిభతో ఆ పాత్రను నిర్వహించి - హీరోయిన్‌గా స్థిరపడ్డారు.


- రావి కొండలరావు 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.