శాస్త్రిగారు చెబితే... సరే!

‘క
న్యాశుల్కం’ (1955) తీసే ముందు నిర్మాత డి.ఎల్‌.నారాయణ, పి.పుల్లయ్య దగ్గరకెళ్లి - పుస్తకం ఇచ్చి చిత్రం డైరక్టు చెయ్యవలసిందిగా అడిగాడు. ‘‘ఇది క్లాసిక్‌. బ్రాహ్మణ కుటుంబాల కథ. నాకు ఆ సంప్రదాయాలూ, కట్టుబాట్లు తెలియవు. నేను డైరక్టు చెయ్యను - చెయ్యలేను’’ అని తిరస్కరించారు. అప్పుడు డి.ఎల్, పుల్లయ్యని మల్లాది రామకృష్ణ శాస్త్రి దగ్గరకి తీసుకెళ్లారు. మల్లాదివారు పుల్లయ్యకి చెప్పవలసిందంతా చెప్పి, డైరక్టు చెయ్యమని గట్టిగా చెబుతే - పుల్లయ్య ‘సరే’ అన్నారు.


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.