కుక్కపిల్ల పేరుకూ ఓ లెక్కుంది

సినిమా వాళ్లకు సెంటిమెంట్లు కాస్త ఎక్కువే. అగ్గిపుల్ల సబ్బుబిళ్ల కుక్కపిల్ల... కాదేదీ అనర్హం అన్నట్లు... సినిమా పేర్ల నుంచి పెంపుడు కుక్కపిల్ల పేర్ల వరకూ అన్నిటికీ అచ్చొచ్చిన సెంటిమెంట్లు ఫాలో అయిపోతుంటారు. ఈ విషయంలో బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధా కపూర్‌ కూడా మినహాయింపు కాదు. ఆమె ఇంట్లో అందరి పేర్లు ‘ఎస్‌’తోనే మొదలవుతాయి. ఆమె తండ్రి ఒకప్పటి ప్రముఖ నటుడు శక్తి కపూర్‌. ప్రతినాయక పాత్రలు, హాస్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తల్లి పేరు శివాంగి కపూర్‌. ఆమె సోదరుడు సిద్ధాంత్‌ కపూర్‌. ఇలా ‘ఎస్‌’తో మొదలయ్యే పేర్లంటే శ్రద్ధకు ఇష్టం. అందుకే తను ముద్దుగా పెంచుకునే కుక్కపిల్లకు కూడా అలాంటి పేరే ఏరికోరి పెట్టింది. ఇంతకీ ఆ పేరేంటో తెలుసా.. షైలో. అలా శ్రద్ధ కుటుంబం మొత్తం ‘ఎస్‌’తోనే నిండిపోయిందన్నమాట.

View this post on Instagram

Friend. 🐶🏝💛

A post shared by Shraddha (@shraddhakapoor) on

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.