సాలూరివారి మూగ పాట!
సింగీతం శ్రీనివాసరావు మొదటి చిత్రం - ‘నీతినిజాయితీ’ (1972). ఇందులోని నాయుకుడు మూగవాడు. ఆ పాత్రని సతీష్‌ అరోరా అనే హిందీ అబ్బాయి వేశాడు. కాంచన నాయిక. వాళ్లకి యుగళగీతం వుంది. అతను మూగవాడు గనుక, వూ వూ అని శబ్దాలు చెయ్యగలడు గనుక, అలాగే నోరు తెరవకుండా నాయికతో కలిసి పాడతాడు. విశేషం ఏమిటంటే - ఆ మూగ గొంతు పాట పాడింది - ఆ చిత్ర సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు.- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.