రెండు భాషల డైలాగులూ కంఠతా!

‘మ
నోహర’ (1954) అన్న జానపద చిత్రాన్ని రెండు భాషల్లో తీశారు. ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకుడు. శివాజిగణేశన్‌ హీరో. అతని తల్లి కన్నాంబ. తమిళ చిత్రానికి కరుణానిధి సంభాషణలు రాశారు. రెండు భాషల చిత్రాన్నీ ఒకేసారి నిర్మించారు - జూపిటర్‌వారు. శివాజి గణేశన్, కన్నాంబలకి ఉద్వేగమూ, ఉద్రేకపూరితమైన పేజీల సంభాషణలున్నాయి. అంత నిడివిగల సంభాషణల్నే తెలుగులోనూ రాయించారు (షాటు పొడుగుకి సరిపోయేలా). బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాశారు. విశేషం ఏమిటంటే, తెలుగు సంభాషణల్ని కూడా కంఠస్థం చేసి శివాజీ గణేశన్‌ చెప్పారు. తరువాత జగ్గయ్య చేత గాత్రం మార్పించారు. అలాగే, కన్నాంబ కూడా ముందు షూట్‌ చేసిన తమిళ డైలాగులు, తరువాత తెలుగు డైలాగులూ కంఠస్థం చేసి చెప్పారు. (రెండు భాషల డైలాగులూ అక్కడే రికార్డింగు) నాలుగైదు రోజులు ముందుగానే డైలాగులు ఇళ్లకి పంపడం వల్ల వాళ్లు కంఠస్థం చెయ్యడం వల్లా అది సాధ్యమైంది. ‘మనోహర’ తెలుగులోనూ పెద్ద హిట్టే!- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.