యాక్‌... ఆ సీన్‌ ఎలా తీశారో!

‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ పేరు చెప్పగానే ముంబయి మురికివాడల జీవితాలను కళ్లకు కట్టిన సన్నివేశాలు గుర్తొస్తాయి. ప్రధానపాత్ర జమాల్‌ చిన్నప్పుడు అమితాబ్‌ బచ్చన్‌ను చూడాలనే ఆతృతతో సెప్టిక్‌ ట్యాంక్‌లోకి దూకే సన్నివేశం గుర్తుంది కదా? అందులో జమాల్‌ ఒంటికి అంటుకున్న మలినాన్ని చూస్తే ప్రేక్షకులకే అసహ్యం పుడుతుంది... ఇక షూటింగ్‌ చేసేటప్పుడు ఎలా భరించారో అనిపిస్తుంది. కానీ చిత్రబృందం మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా లొట్టలేసుకుంటూ మరీ ఆ సన్నివేశాన్ని తీశారంట. ఎందుకంటే అది దుర్వాసన వచ్చే మలినం కాదు... నోరూరించే చాకొలెట్‌, పీనట్‌ బటర్‌ మిశ్రమం. మేకప్‌తో ఎన్ని అద్భుతాలు చేయొచ్చన్న దానికి ఆ సన్నివేశం ఓ ఉదాహరణగా నిలిచిపోయింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.