15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌కి బాలు

స్పీ బాల సుబ్రహ్మణ్యం.. తెలుగు, తమిళం, హిందీ ఇలా ఏ భాషలోనైనా పాటను అలవోకగా పాడే గాన గాంధర్వుడు. 40 వేలకు పైగా పాటలు పాడి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. తెలుగు సినిమా సంగీత ప్రపంచానికి సంబంధించి ఘంటసాల వారసునిగా ఈయన్ని చెప్పుకుంటారు. కెరీర్‌ ప్రారంభంలో బాలీవుడ్‌లోనూ అంతే హుషారుగా ఉన్న బాలు ఆ తర్వాత విరామం తీసుకున్నాడు. ఆపై 15 సంవత్సరాల తర్వాత షారుఖ్‌ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో టైటిల్‌ గీతాన్ని ఆలపించారు. ఈ పాట ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిన విషయమే. ఈ సినిమా 2013లో విడుదలై సంచలనం సృష్టించింది. బాలు గారికి కమ్‌బ్యాక్‌ ఫిలింగా నిలిచింది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.