మీరజాలగడా..!

‘శ్రీకృష్ణతులాభారం’ రంగస్థల నాటకంలో స్థానం నరసింహారావు సత్యభామగా నటించేవారు. ఆయనే రాసుకుని పాడిన ‘‘మీరజాలగలడా నాయానతి’’ పాట పెద్దహిట్టు. ఆయన నటనకీ, పాటకీ ప్రేక్షకులు వెర్రెత్తిపోయి, ఈలలు కొడుతూ, ‘వన్స్‌మోర్‌’ కొట్టేవారు. 1935లో తొలిసారిగా ‘శ్రీకృష్ణతులాభారం’ సినిమాగా తీశారు. అప్పటికి ఆ పాట పుట్టలేదు. 1955లో రాజరాజేశ్వరీ కంపెనీ అదే చిత్రం తీసినప్పుడు ఎస్‌.వరలక్ష్మి సత్యభామగా నటించి, అనుమతి తీసుకొని ‘మీరజాలగలడా’ పాడింది. అదే వరస. 1966లో సురేష్‌ వాళ్లు మళ్లీ ‘శ్రీకృష్ణ తులాభారం’ తీశారు. జమున సత్యభామ. అదే పాటని, అదే వరసతో పాడించారు. సుశీల నేపథ్యంలో, ఎన్‌.టి.రామారావు ‘శ్రీకృష్ణసత్య’ తీసినప్పుడు, అలాంటి సందర్భంలో, అలాంటి పాట పెట్టారు. అసలు పాటని ఉపయోగించడానికి హక్కులు లేవు గనక, పాట సాహిత్యం మార్చి ‘మాట దాటగలడా’ అన్నట్టుగా రాయించి పాడించారు. వరసే అదే - స్థానం వరసే!


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.